(కారుణ్య నియామకాలు) గురించి పూర్తి సమాచారం
What is Compassionate Appointment (కారుణ్య నియామకం అంటే ఏమిటి) ?
ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగానే చనిపోయిన లేదా ఉద్యోగం చెయ్యడానికి ఆరోగ్యం సహకరించకపోయినా అప్పటివరకూ అతని / ఆమె సంపాదన పై ఆధారపడి జీవిస్తున్న అతని / ఆమె కుటుంబ సభ్యులకు కుటుంబ పోషణ నిమిత్తము, అర్హత గల కుటుంబ సభ్యులలో ఒకరికి, నియమ నిబంధనల ప్రకారం ఉద్యోగ అవకాశం కల్పించడము ఈ కారుణ్య నియామకాల వెనుక వున్న ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యము.
నిబంధనలు:
- కారుణ్య నియమకము కోసము దరఖాస్తును ఉద్యోగి ఏ కార్యాలయములో అయితే పనిచేస్తూ మరణించారో అదే కార్యాలయపు అధికారికి సమర్పించాలి.
- ఉద్యోగి చనిపోయిన తేదీ నుండి ఒక సంవత్సరము లోపు ఉద్యోగము కోసము దరఖాస్తు చేసుకొనవలసి ఉన్నది.
- చనిపోయిన ఉద్యోగి కుటుంబములో ఇతరత్రా సంపాదనాపరులు లేనప్పుడు భార్య / భర్త (spouse) పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు వారి అర్హతల మేరకు ఉద్యోగము పొందుటకు అర్హులు.
విద్యార్హతలు:
- కారుణ్య నియామకములో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగము కొరకు కనీస విద్యార్హతలుగా డిగ్రీ విద్యార్హత మరియు కంప్యూటర్ నిర్వహణ పరిజ్ఞానము కలిగి ఉండాలి (G.O. Ms. No. 135 GA (Ser.B) department, తేదీ. 12.05.2014).
- కారుణ్య నియామకములో డిగ్రీ అర్హత లేకున్నా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నా, సదరు వ్యక్తి 5 సంవత్సరముల లోపల డిగ్రీ అర్హత మరియు 2 సంవత్సరముల లోపల కంప్యూటర్ నిర్వహణ పరిజ్ఞా నము పరీక్ష (Proficiency Test) యందు ఉత్తీర్ణత కావలసి ఉన్నట్లుగా షరతులతో కూడిన నియామకము ఇవ్వవచ్చును (G.O. Ms. No. 112 GA (Ser.A) department, తేదీ. 18.08.2017).
కారుణ్య నియామక పద్దతులు:
- ఉద్యోగములో ఉంటూ లేదా సెలవులో ఉంటూ ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడినవారికి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాన్ని చేపట్టవచ్చును (సర్క్యులర్ మెమో నెం. 41758/Ser.G/2006-2, Dated: 19-07-2007).
- కారుణ్య నియామక పద్ధతిలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 నియమనిబంధనలలోని రూల్ 22 ప్రకారం రిజర్వేషన్ల నియమం పాటించాలి
- కారుణ్య నియామకములు, చనిపోయిన ఉద్యోగి పనిచేసిన శాఖలో మాత్రమే ఖాళీగా ఉన్న పోస్టులో నియమ నిబంధనల మేరకు నియమించాలి
- ఉద్యోగి సర్వీస్ లో ఉంటూ చనిపోయిన సందర్భాలలో, సదరు కార్యాలయములో గాని, జిల్లా యూనిట్ లో గాని ఖాళీలు ఉన్న సందర్భాలలో సంబంధిత అధికారి, అర్హత గల కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకము నియమ నిబంధనల మేరకు కల్పించాలి. ఒకవేళ కార్యాలయములో పోస్టులు ఖాళీలు విషయము, ఇంతకుముందే జిల్లా కలెక్టర్ (నోడల్ అధికారికి) నివేదించిన తరువాత అర్హతలు గల అభ్యర్ది నుండి దరఖాస్తు వచ్చినట్లయితే, వాస్తవ విషయాలను కలెక్టర్ (నోడల్ అధికారికి) తెలియజేసి, వారి అనుమతి పొందిన తరువాత మాత్రమే ఉత్తర్వులు జారీ చెయ్యాలి. అలాంటి సందర్భాలలో జిల్లా కలెక్టర్ వారి ముందస్తు అనుమతి లేకుండా నియమకాలు చేయరాదు (G.O.Ms.No.215,GA (Ser.A) Department, తేదీ :08.04.1993)
- ఉద్యోగి పనిచేసిన శాఖలో అభ్యర్ది అర్హతకు తగ్గ ఉద్యోగము Rule of Reservation ప్రాతిపదికన ఖాళీలు లేనప్పుడు మాత్రమే, అటువంటి కేసులను నోడల్ అథారిటీ అయిన జిల్లా కలెకకు కారుణ్య నియామకం చేయడానికి పైన పేర్కొన్న సూచనల ప్రకారము వాస్తవ విషయములు తెలియజేస్తూ ఖాళీగా ఉన్న పోస్టుల పర్షితిని తెలియజేస్తూ తిపాదనలు పంపాలి
- సర్వీస్ లో ఉంటూ ఉద్యోగి చనిపోయిన సందర్భాలలో, అతని / ఆమె, భార్య / భర్త సర్వీస్ పెన్షన్ పొందుతున్న సందర్భాలలో కారుణ్య నియామకము కల్పించకూడదు. అనగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటున్న, పదవీ విరమణ చేసిన తల్లిదండ్రు లలో ఎవరైనా సర్వీస్ పెన్షన్ పొందుతున్న సందర్భాలలో, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబసభ్యులెవరూ కారుణ్య నియమకములకు అర్హులు కారు (ప్రభుత్వ మెమో నెం. 3548/Ser.G/A2/2010-8, GA (Ser.G) department, తేదీ: 24.03.2012).
- కారుణ్య నియమకాలు, కేవలము సర్వీస్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తు న్న కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. కావున చనిపోయిన పింఛనుదారుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పధకము వర్తించదు (ప్రభుత్వ మెమో నెం. 618/Ser.A/79-11, తేదీ. 17.12.1979).
- కారుణ్య నియమకములలో రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయకూడదు (ప్రభుత్వ మెమో నెం. 536/Ser.ఏ/96, GAD, తేదీ. 09.10.1996).
- జూనియర్ అసిస్టెంట్ స్కేలుకు మించకుండా ఉన్న పోస్టు లలో లేక అంతకంటతక్కువ స్కేలులో ఉన్న పోస్టు లలో నియమించవచ్చు. కారుణ్య నియమకాలు జూనియర్ అసిస్టెంట్ పోస్టు కంటే ఎక్కువ జీతం స్కేలు కలిగి ఉన్న టీచర్, ఇంజనీరు, సివిల్ అసిస్టెంట్ సర్జను తదితర పోస్టులకు అర్హతలు కలిగి ఉన్నప్పటికనియమించరాదు (G.O.Ms.No.480,GA (Ser.A) Department, తేదీ :26.11.2002)
- కారుణ్య నియమకాలకు సంబంధించి సదరు కార్యాలములలో ఖాళీగా ఉన్న పోస్టు ల విషయము (vacancy position) క్రమము తప్పకుండా జిల్లా కలెక్టర్ (నోడల్ అధికారికి) నిర్దేశిత నమూనాలో వివరముగా పంపించవలసి ఉన్నది నిర్దేశిత నమూనాలు జతచేయడమైనది (G.O.Ms.No.215, GA (Ser.A) Department, తేదీ :08.04.1993).
EXGRATIA:
చనిపోయిన ఉద్యోగి కుటుంబ సభ్యులలో సంపాదనాపరులు ఎవ్వరూ లేనప్పుడు, భార్య / భర్త కారుణ్య నియమక అవకాశాన్ని వినియోగించుకోనప్పుడు, మైనర్లుగా ఉన్న పిల్లలు, అర్హత గల వ్యక్తులు లేనప్పుడు, కొన్ని షరతులకు లోబడి అట్టికుటుంబానికి పారితోషకము (exgratia) చెల్లించే అవకాశము ప్రభుత్వము కల్పించినది.
- నాల్గవ తరగతి ఉద్యోగులు – రూ. 5,00,000/
- నాన్ గెజిటెడ్ ఉద్యోగులు – రూ. 8,00,000/
- గెజిటెడ్ ఉద్యోగులు – రూ. 10,00,000/
కారుణ్య నియమకము కోసము దరఖాస్తుతో పాటుగా జతపరచవలసిన వివరములు
1. మరణ ధృవీకరణ పత్రము (Death Certificate issued by the competent authority)
2. కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రము ( Family Member Certificate issued by the concerned Tahsildar)
3. విద్యార్హత పత్రములు.
4. పుట్టిన తేదీ వివరములు తెలియజేసే పత్రము.
5. దరఖాస్తు చేయు అభ్యర్థి కుటుంబములో సంపాదనాపరులు ఎవరూ లేరని ధృవీకరణ పత్రము (No earning member certificate issued by the concerned Tahsildar)
6. దరఖాస్తు చేయు అభ్యరికుటుంబములో ఎవరికీ ఆస్తు లు లేవు అని తెలిపే ధృవీకరణ పత్రము (No property certificate issued by the concerned Tahsildar)
7. కులధృవీకరణ పత్రము (అభ్యర్ధి SC/ST/BC అయినచో)
8. భర్త / భార్య, తమ సంతతిలో ఎవరికి ఉద్యోగము ఇవ్వవలెననే విషయములో ఇచ్చే అంగీకార పత్రము. ఈ పత్రము ఎక్కువ మంది అర్హతలు గల సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే అవసరము.
9. అభ్యర్ధి యొక్క విద్యార్హతల బట్టి వారు 1 నుండి 10 తరగతులు చదివినట్లు గా తెలియజేస్తూ సంబంధిత అధికారులు జారీ చేసిన స్టడీ సర్టిఫికేట్స్ (” స్థానిక అభ్యర్థి” అయిన “స్థానిక కేడర్” తెలుసుకొను నిమిత్తము)
మరణించిన ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తున్న అతని / ఆమె కుటుంబ సభ్యులు అనగా?
కారుణ్య నియామకాలు-అర్హత కలిగిన కుటుంబ సభ్యులెవరు? కుటుంబంలో సంపాదనా పరులు (Earning Member) ఇతరత్రా ఎవ్వరూ లేనప్పుడు కారుణ్య నియామకాల పథకం క్రింద, మరణించిన ఉద్యోగిపై పూర్తిగా ఆదారపడి జీవిస్తున్న వారిలో అర్హతలు కలిగిన ఈ క్రింద తెలియజేసిన వారికి నియమ నిభంధనల మేరకు జూనియర్ అసిస్టెంట్ పోస్టు స్కేలుకు మించకుండా ఏదైనా ఉద్యోగం కల్పించవచ్చు. కాని రికార్డు అసిస్టెంటు పోస్టు స్కేలు, జూనియర్ అసిస్టెంటు పోస్ట్ స్కేలుకన్నా తక్కువ అయినప్పటికీ, రికార్డు అసిస్టెంట్ పోస్టును నేరుగా నియమించుట (Direct Recruitment) కు నిబంధనలు అనుమతించనందు వల్ల, మరియు కారుణ్య నియామకాలు నేరుగా నియమించు పద్ధతి (Direct Recruitment)లో చేస్తారు గనుక రికార్డు అసిస్టెంటు పోస్టులో కారుణ్య నియామకాలు చేయరాదు. [Government Memo. No. 536/Ser.A/96-1 G.A. Department, dated 9-10-1996] ఈ క్రింద తెలిపిన ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులను కారుణ్య నియామకాల ఉద్యోగాలకు పరిగణించవచ్చు. (G.O.Ms. No.687 G.A. (Ser) Dept., dt. 31-10-1997] (కొన్ని నిబంధనల మేరకు):
- మరణించిన ఉద్యోగి భార్య/భర్త, ఒకవేళ వారికి ఉద్యోగం ఇష్టం లేకపోయిన, లేక ఇతరత్రా అనర్హులైన సందర్భంలో మరణించిన ఉద్యోగి భార్య తన సంతతిలో తను కోరుకున్న కుమారుడు/కూతురు (Govt. Memo. No.140733/Ser.A/2003-1 GAD, dt. 14-11-2003] పై ప్రభుత్వ ఉత్తరువులలో (Para 3) తల్లి (Mother) అనే పదం ఉపయోగించారు. తండ్రి అనే పదం ఉపయోగించలేదు. కాని జనరల్ రూలు 2(31) క్రింద వివరణ యిస్తూ (Explanation) ఎక్కడైతే ఏ లింగం అంటే పురుష లేక స్త్రీ లింగం తెలియజేశారో అవసరం మేరకు దాని వ్యతిరేక లింగంకు కూడా వర్తిస్తుందని తెలియజేశారు. (The Words importing either gender in there or special rules shall be taken to include those of other gender if circumstances so require) కావున తండ్రి విషయంలో కూడా వర్తిస్తుందని భావించాలి.
- a) మరణించిన ఉద్యోగి భార్య / భర్త లేదా ఒకవేళ వారికి ఉద్యోగము ఇష్టము లేకపోయినా, లేక ఇతరత్రా అనర్హులు అయిన సందర్భములో వారి సంతానములో వారు కోరుకున్న కుమారుడు / కుమార్తె. ( ప్రభుత్వ మెమో నెం. 140733/Ser .A/2003-1, తేదీ:14-11-2003.
- b) అవివాహిత కుమారుడు / కుమార్తె.
- c) మరణించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన వారసుడైన వివాహితుడైన కుమారుడిని, కుటుంబంలో సంపాదించే ఇతర సభ్యులు లేని పక్షములో కారుణ్య నియామకం కోసం పరిగణించవచ్చును (ప్రభుత్వ మెమో నెం. .23327/Ser.G/2007-2, తేదీ :19-09-2007).
- d) అవివాహితుడిగా మిగిలిపోయిన మరణించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క సోదరుడు/ సోదరి ని కారుణ్య నియామకం కోసం పరిగణించబడవచ్చు.
- e) మరణించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క దత్తపుత్రు డు లేదా కుమాయ కారుణ్య నియామకం కోసం పరిగణించబడవచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తేదీకి కనీసం ఐదు సంవత్సరాల ముందు దత్తత చట్టబద్ధంగా జరిగి ఉండాలి.
- f) మరణించిన ఉద్యోగి కుటుంబములో పెద్ద కుమారుడు, కుటుంబము నుండి విడిపోయి స్వతంత్రముగా సంపాదిస్తూ, వేరేగా ఉన్న సందర్భములో దివంగత ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తు న్న ఇతర అర్హతగల సంతతిని ఉద్యోగములో నియమించవచ్చు.
- అనారోగ్య కారణాలపై పదవీ విరమణ చేసిన – (Medical Invalidation) ఉద్యోగి అర్హత గల కుటుంబ సభ్యులు.
కారుణ్య నియామకములు కనిష్ట మరియు గరిష్ట వయస్సు:
కారుణ్య నియామకములు నేరుగా నియమించేవి (Direct recruitment) గా నిర్ణయిస్తూ ప్రభుత్వ మెమో నెం. 536/Ser.A/96-1 GA(Ser.A) తేదీ. 09.10.1996 ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడ్డవి. కావున ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 నియమ నిబంధనలు ఈ విషయములో వర్తిస్తాయి.
పై నిబంధనలలో గల రూలు 12(V) మేరకు 18 సంవత్సరాలు తక్కువగాను మరియు 34 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న వారు నియమకమునకు అనర్హులు.
కానీ ఒకవేళ చనిపోయిన ఉద్యోగిపై ఆధారపడిన పిల్లలు మైనర్లు అనగా 16 సంవత్సరాలు ఉన్నట్లు అయితే, అట్టి విషయము ఉద్యోగి చనిపోయిన వెంటనే, ఉద్యోగము కొరకు ధరఖాస్తు చేయవలసి ఉంటుంది. తదుపరి మైనారిటీ తీరి 18 సంవత్సరాలు నిండి మేజరు అయిన వెంటనే ఉద్యోగము కొరకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. అనగా 18 సంవత్సరాల వయస్సును నిండిన తరువాతే, కారుణ్య నియామకం కోసం పరిగణించబడుతుంది ( G.O. Ms. No. 165 GA (Ser.A), తేదీ. 20.03.1989 మరియప్రభుత్వ మెమో నెం. 60681/Ser.A/2003-1 తేదీ: 12-8-2003)
గరిష్ట వయస్సు విషయమై, G.O. Ms. No. 132, GA (Ser.A) department, తేదీ. 15.10.2018 ద్వారా 42 సంవత్సరాలుగా ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసినది. SC/ST/PHC అభ్యర్ధు లకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 నందలి 12 V (b) (i) (ii) నందు తెలియజేసిన విధముగా అదనపు వయస్సు 42 సంవత్సరములకు అదనముగా పొందుటకు అర్హులు. పై హెచ్చించిన గరిష్ట వయస్సు, యూనిఫారం సర్వీసు యందు పని చేయు పోలీసు ఉద్యోగులకు, అబ్కారి, అగ్ని మాపకదళం, అటవీశాఖా మరియు రవాణా శాఖ ఉద్యోగులకు వర్తించదు. కానీ అట్టి ఉత్తర్వులు తేదీ. 30.09.2021 వరకు అమలులో ఉంటుందని పేర్కొని ఉన్నారు తదనంతరము గరిష్ట వయస్సు 34 సంవత్సరములుగా ఉండును. కావున గరిష్ట వయస్సు ఏ తేదీ వరకు అమలులో ఉంటుందో ప్రభుత్వ ఉత్తర్వులను జాగ్రత్తగా పరశీలించవలసి ఉంటుంది.
సర్వీస్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగి భర్త / భార్య (Spouse) కు కారుణ్య నియామకములో ఉద్యోగము ఇచ్చుటకు అన్ని కులముల వారికి గరిష్ట వయస్సు 45 సంవత్సరములుగా నిర్ణయిస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసి ఉన్నది. (G.O. Ms. No. 144 GA (Ser.D) department, తేదీ. 15.06.2004).
ఉద్యోగము కోసం ధరఖాస్తు చేసుకున్న నాటికవయస్సు నియమ నిబంధనలు మేరకు ఉన్నప్పటికీ, అతనికి ఉద్యోగము ఇచ్చు ఉత్తర్వులు జారీ చేయు నాటికి గరిష్ట వయస్సు మించినప్పటికీ అతనికి / ఆమెకు ఉద్యోగము కల్పించవచ్చును.
ధరఖాస్తుదారుని యొక్క కనిష్ట మరియు గరిష్ట వయస్సు ను లెక్కించుటకు ఉద్యోగి చనిపోయిన సంవత్సరము లోపల ఏ తేదీనైతే ధరఖాస్తు చేసినారో, ఆ తేదీ నుండి వయస్సును లెక్కించవలసి ఉంటుంది.
చనిపోయిన ఉద్యోగి భర్త / భార్య (Spouse) విషయములో గరిష్ట వయస్సు లెక్కించుటకు ప్రభుత్వ ఉత్తర్వులు సర్క్యులర్ మెమో నెం. 3731/Ser.A/202-3 GA (Ser.A) Department తేదీ. 11.12.2003 మేరకు గరిష్ట వయస్సు ఉద్యోగి చనిపోయిన సంవత్సరము లోపల ధరఖాస్తు చేసిన సంవత్సరములోనే జూలై నెల ఒకటవ తేదీ నుండి లెక్కించవలసి ఉంది.
వివాహిత కుమార్తెలు - కారుణ్య నియమకము
వివాహిత కుమార్తెను కారుణ్య నియామకము చేపట్టే విషయములో ప్రభుత్వ మెమో నెం. 40610/A.1/Admn.II/2004, Fin (Admn.ll), తేదీ. 20.03.2004 మరియు ప్రభుత్వ మెమో నెం. 80863/Ser.C/A1/2005-1, GAD (Ser.G), తేదీ. 06.08.2005 లో ఇచ్చిన నిబంధనలను / సూచనలను జాగ్రత్తగా పరిశీలించి నియామకము చేయవలసి ఉన్నది
వివాహిత కుమార్తెలను కారుణ్య నియమకములో ఉద్యోగము కల్పించు విషయములో, రాష్ట్ర ఆడిట్ శాఖ సంచాలకులు (Director of State Audit) తెలిపిన సంశయాలకు వివరణ ఇస్తూ ప్రభుత్వము మెమో నెం. 406/10/A.1/Admn.II/2004, Fin (Admn.ll), తేదీ. 20.03.2004 ద్వా రా ఈ క్రింది విధముగా ఉత్తర్వులు జారీ చేసినది.
వివాహిత కుమార్తెలు – కారుణ్య నియమకము ముఖ్యాంశాలు:
- a) భార్య / భర్త (spouse) అనర్హులుగా ఉన్నా, లేక అయిష్టంగా ఉన్నా లేక ఆ కుటుంబములో అవివాహితులుగా చిన్న వారు గాని, పెద్దవారు గాని లేని సందర్భములో,
- b) ఉద్యోగములో ఉంటూ చనిపోయిన తండ్రి / తల్లి పై వివాహిత కుమార్తె పూర్తిగా ఆధారపడి
- జీవిస్తు న్న సందర్భములో.
- c) పై రెండు షరతులకు లోబడి ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తు న్న వివాహిత కుమాలలో,
- ఒక్కరికి ఉద్యోగ అవకాశము కల్పించవచ్చు.
- d) పై ప్రభుత్వ ఉత్తర్వులు పేరా 2 ప్రకారము కుమార్తెకు వివాహము అయిన వెంటనే, ఉద్యోగి అయినా నిరుద్యోగి అయినా, ఆమె భర్త నిరుద్యోగి అయినా కూడా ఆమె తల్లిదండ్రు లపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి కాదు. వివాహిత కుమార్తె పూర్తిగా తండ్రి / తల్లి పై పోషణ నిమిత్తము ఆధార పడి జీవిస్తూ ఉండాలి. భర్త ఆచూకీ సంవత్సరాల తరబడి తెలియకున్నా, లేక అతను చనిపోయినా, భర్త ఏ విధమైనా ఆస్థిపాస్తులు వదిలి ఫైళున్నా, కేవలము వివాహిత కుమార్తె తల్లి / తండ్రి పై ఆధారపడి వారి పోషణలో ఉన్న సందర్బాలలో మాత్రమే కారుణ్య నియమాకాలకు అర్హులు. వివాహిత కుమార్తె కారుణ్య నియామకం విషయమై ప్రభుత్వము నెం. 80863/Ser.G/A1/2005-1, GAD (Ser.G), తేదీ. 06.08.2005 ద్వా రా వివరణ ఇస్తూ , మరణించిన ప్రభుత్వ ఉద్యోగి జీవిత భాగస్వామిని చూసేందుకు వివాహిత కుమార్తెకు కారుణ్య నియామకం అందించబడుతుంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీవిత భాగస్వామి సజీవంగా లేనప్పుడు, వివాహిత కుమార్తెకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యం పనిచేయదు. అందువల్ల, ప్రభుత్వ ఉద్యోగి చనిపోయి మరియు జీవిత భాగస్వామి కూడా జీవించి లేనటువంటి సందర్భములలో కారుణ్య నియామకాన్ని వివాహిత కుమార్తెలను పరిగణించలేము.
ఉద్యోగములో ఉంటూ చనిపోయిన ఉద్యోగి అవివాహిత కుమార్తె, కారుణ నియామకము కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత, పాలనపర జాప్యము వలన సకాలములో ఉద్యోగ ఉత్తర్వులు జారీకాని సందర్భములో, ఈ లోగా ఆమె వివాహము చేసుకొన్ననూ, ఆమె కారుణ్య నియమకానికి అర్హ్పు రాలు (ప్రభుత్వ మెమో నెం. 55769 Ser.A/93-3, GA(Ser.A) Department తేదీ. 27.01.2000).
ఏడు సంవత్సరాలుగా ఆచూకీ తెలియని ఉద్యోగి కుటుంబ సభ్యులకు నియామకములు
ఏడు సంవత్సరాలు వరుసగా ఆచూకి తెలియకుండా, జాడ తెలియని ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులలో ఒకరికి కొన్ని షరతులకు లోబడి ప్రభుత్వ మెమో నెం. 60681/Ser.A/2003-1 తేదీ: 12-8-2003
ఈ క్రింది నియమ నిబంధనలకు మేరకు కారుణ్య నియమకము కల్పించవచ్చు.
- a) ఏడు సంవత్సరాల కాల వ్యవధిని కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో జాడ తెలియని విషయమై ఫిర్యాదు (FIR) చేసిన తేదీ నుండి లెక్కించవలసి ఉన్నది. పోలీసు శాఖవారు కనుమరుగైన ఉద్యోగి జాడ తెలియదని, నిర్ధారిత స్టడీకేట్ ఇవ్వవలసి ఉంది.
- b) జాడ తెలియని ఉద్యోగి FIR నమోదు చేసిన తేదీ నుండి పదవీ విరమణ తేదీకి, ఇంకా ఏడు సంవత్సరాలకంటే తక్కువ సర్వీస్ ఉంటే పై ఉత్తర్వులు వర్తించవు.
- c) ఉద్యోగము నిమిత్తము అర్హత గల కుటుంబ సభ్యుల నుండి, ఉద్యోగ జాడ తెలియని 7 సంవత్సరముల తరువాత, ఒక సంవత్సరము లోపల దరఖాస్తు చేసుకోవాలి.
- d) ఉద్యోగ అవకాశము కల్పించు సమయములో లబ్దిదారు నుండి పూచి బాండ్, షరతులు విధిస్తూ , అనగా ఒకవేళ జాడ తెలియని ఉద్యోగి తిరిగి వచ్చినా, లేక జీవించే ఉన్నాడని తెలిసినా, లబ్దిదారుడిని ఉద్యోగం నుండి తొలగించుటకు తదితరములు తెలియజేస్తూ పొందవలసి ఉన్నది.
- e) జాడ తెలియని ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియమకము కొరకు ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No.378 GA (Ser-A) department తేదీ : 24-08-1999 మరియు ప్రభుత్వ మెమో నెం. 60681/Ser.A/2003-1 తేదీ: 12-8-2003 నందు జారీచేసిన ఉత్తర్వులను విధిగా పాటించవలసి ఉన్నది.
0 Comments:
Post a Comment